హాస్టల్‌ను తనిఖీ చేసిన DEO

26-11-2026 | 10:28pm

నాగల్ గిద్ద, నవంబర్ 26 : నాగల్‌గిద్ద మండలంలోని మోర్గి తెలంగాణ మోడల్ స్కూల్(Morgi Telangana Model School) మరియు హాస్టల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) శ్రీమతి రోహిణి గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, హాస్టల్ వసతులు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి, వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదువుతూ, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల విద్యాధికారి మన్మధ కిషోర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సువర్ణ, కేర్ టేకర్ ప్రియాంక పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు