సందడిగా క్రికెట్ టోర్నమెంట్..

14-10-2026 | 02:43pm
  1. సుధా ట్రేడర్స్ ఆధ్వర్యంలో నిర్వహణ 
  2. ఉత్సాహంగా పాల్గొన్న మండల క్రీడాకారులు 

పాపన్నపేట,అక్టోబర్14: మండల కేంద్రం పాపన్నపేటలోని ఉన్నత పాఠశాల మైదానంలో(High school playground) బుధవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సందడిగా సాగింది. మండల కేంద్రంలోని సుధా ట్రేడర్స్ భారతి సిమెంట్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 24 జట్లు పాల్గొన్నాయి.

స్థానిక సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించి యువకులను ఉత్సాహపరిచారు. యువత కేరింతలు, క్రీడాభిమానుల సందడి మధ్య క్రీడా ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఆయా పార్టీల గ్రామ, మండల నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు