థాయ్లాండ్కు నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రపంచ ఆర్థిక పరిణామాలపై కీలక చర్చలు జరగనున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం థాయ్లాండ్కు వెళ్లారు. అక్కడ జరిగే IMF and World Bank Annual Meetingsతో పాటు G20, G7 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఎటువైపు కదులుతున్నాయి? అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలు ఏమిటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు ఎలాంటి పరిష్కారాలు అవసరం? వంటి అంశాలపై జరిగే చర్చల్లో భారత్ తన అభిప్రాయాలను వెల్లడించనుంది.
ఈ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్ పలు దేశాల ఆర్థిక మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. థాయ్లాండ్ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి ఎక్నితి నితిథన్ప్రపాస్తో పాటు స్విట్జర్లాండ్, జపాన్, లక్సెంబర్గ్, భూటాన్ దేశాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. Global Economic Outlook, Financial Sector Issues, Development Priorities వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక రంగానికి సంబంధించిన కీలక అంశాలపై జరిగే ఈ చర్చలు ప్రపంచ ఆర్థిక విధానాల దిశను అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా నిలవనున్నాయి.