ఇక ప్రత్యక్ష ప్రజారాజకీయ క్షేత్రంలోకి ప్రవీణ్ ఆగమనం..!
- కేసీఆర్ సీమ్మె సంకల్పం..
- ప్రజలతోనే ఉంటా
- కొత్త రక్తాన్ని పార్టీ లోకీ
- ఉద్యమ కారులను ఏకం చేస్తా
- బీఆర్ఎస్ నేత రేణికుంట్ల ప్రవీణ్
బెల్లంపల్లి, అక్టోబర్ 12: కేసీఆర్ ను సీఎం చేసే సంకల్పంతోనే రాజకీయ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్టు బీఆర్ఎస్ నేత, మాజీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్(Former State SC/ST Commission member Renikuntla Praveen) అన్నారు. బెల్లంపల్లి బూడిదగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంతకాలం ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు గా కొనసాగిన తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఇక నుంచి ప్రత్యక్ష ప్రజా క్షేత్రం వెలుగులో రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటాననీ స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేయాలనే ఏకైక లక్ష్యం తో పనిచేస్తాన న్నారు. నియోజక వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై క్రియాశీలంగా ఉద్యమిస్తానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పిలుపును అందుకొని పనిచేసిన సంగతి బెల్లంపల్లి ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల కోసం విద్యార్థి దశలోనే ఆర్ ఎస్ యూ ద్వారా విప్లవోద్యమ బాటను ఎంచుకున్నానీ తెలిపారు. తన రక్తంలోనే పోరాట సంస్కృతి ఉందని పేర్కొన్నారు. 2001లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో నాయకత్వం స్థానంలో ఉండి పనిచేశానని వెల్లడించారు.
ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కేసీఆర్ తో కలసి అవిశ్రాంతంగా పోరాటం చేశానన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికలో ఉద్యమ పార్టీ బీఆర్ ఎస్ నీ ప్రజలు గుండెకు హత్తుకున్నారన్నారు. చట్టసభలోకి వెళ్ళే ఆశయం ఉన్నప్పటికీ కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానన్నారు. అప్పుడు బెల్లంపల్లి లో పార్టీ గెలిపించడంలో తాను తీవ్రంగా కృషి చేశానని చెప్పారు.
కేసీఆర్ గ్రంథాలయం చైర్మన్ బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయాలను ఆధునికంగా అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గానికో గ్రంథాలయాన్ని నిర్మించి తలమానియంగా నిలిపానని అన్నారు. పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు ఉచితంగా గ్రంథాలయాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
300మంది పైగా ఉద్యోగాలు లభించడానికి కృషి చేశానని తెలిపారు. ఇదేక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు గా నియామకమై, అణగారిన ప్రజలకి చట్ట పరమైన న్యాయ సేవలను అందించానున్నారు. రెండు ప్రధాన చట్ట బద్ద బాధ్యతల కారణంగా పదేళ్లు ప్రత్యక్ష రాజకీయాలల్లో క్రియాశీలంగా ఉండలేక పోయాయని వివరించారు.
ప్రజా ఉద్యమ స్ఫూర్తి తోనే ఇంత కాలం గ్రంథాలయ, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు గా ప్రజలకు సేవలు అందించానన్నారు. అదే స్ఫూర్తి తోనే ప్రజల కోసం పనిచేస్తానని పునరుద్ఘాటించారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు, గనులు తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నిరుద్యోగులకు జీవనభృతి కరువైందని వాపోయారు.
కేసీఆర్ హయాంలో కారుణ్యం ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. మెడికల్ బోర్డులు పనితీరు సక్రమంగా అమలయ్యేదని చెప్పారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ పాలకులు వైఫల్యం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. అందుకే ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.
2028లో కేసీఆర్ ను మళ్ళీ సీఎం ను చూడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేయాలనే ప్రధాన ధ్యేయంతో ప్రజల్లోకి వెళ్తానని వెల్లడించారు. ప్రజలతోనే తన జీవితమని సాగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రజల సమస్యలను తెలుసు కొనేందుకు ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా తాను వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
ప్రజల సమస్యల్ని వెబ్ సైట్ ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఉద్యమాలు ఇక నుంచి చూస్తారని తెలిపారు. ప్రజల కోసం పనిచేయడానికి అందుబాటులో ఉన్నా నయా టెక్నాలజీ నీ ఉపయోగించే వినూత్న మైన యోచన ఉందని పేర్కొన్నారు.