టీజేఏ జిల్లా అధ్యక్షుడిగా సతీష్ ఎన్నికపై బిఆర్ఎస్ హర్షం

14-10-2026 | 04:08pm

వెంకటాపూర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(Telangana Journalists Association) జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ బేతి సతీష్ యాదవ్ ఎన్నిక కావడం హర్షణీయమని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్‌ వద్ద ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, సీనియర్ నాయకుడు మల్కా రమేష్‌లు సతీష్ యాదవ్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం లింగాల రమణారెడ్డి మాట్లాడుతూ.. వెంకటాపూర్ మండలానికి చెందిన వ్యక్తి జిల్లా స్థాయి జర్నలిస్టు సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,

వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో యూనియన్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు రమేష్ మాట్లాడుతూ.. బేతి సతీష్ యాదవ్ టీజేఏ ములుగు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అభినందనీయమని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆయన తన వంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు