విద్యుత్ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన

14-10-2026 | 04:03pm

అచ్చంపేట అక్టోబర్ 14:  నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో రూ.53.78 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/30 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(State Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కలగనుంది.

ఈ కార్యక్రమంలో సీఈడీ కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి. పాటిల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌ కర్నూల్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్, అచ్చంపేట సబ్‌ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం, విద్యుత్‌ శాఖ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) నరసింహ, గ్రామ సర్పంచ్‌ మంజుల, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు