ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని(Indiramma Jeevitha Bima scheme) మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్(Collector Prathima Singh), సర్పంచ్ దుర్గ దేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పథకం ప్రాముఖ్యత, కుటుంబాలకు జీవిత బీమా ద్వారా కలిగే ఆర్థిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హిమ భార్గవి, ఎంపీడీవో టి. చిన్నారెడ్డి, ఎంపీవో ఏ. ప్రకాష్, తహసీల్దార్ బాలలక్ష్మి, ఏపీఎం దుర్గాప్రసాద్, గ్రామ సర్పంచ్ దుర్గాదేవి, ఉపసర్పంచ్ బాల శివ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పుష్పలత, కుమార్, కృష్ణ, పాల్గొన్నారు.