కార్మిక చట్టాలపై అవగాహన ఉండాలి

20-11-2026 | 03:09pm

కుభీర్,(విజయక్రాంతి): అసంఘటిత కార్మికులు తమ హక్కుల తో పాటు కార్మిక చట్టాలపై అవగాహనను కలిగి ఉండాలని డ్రీమ్ సొసైటీ ప్రతినిధి సుంకరి సాయినాథ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి-కె గ్రామం(Pardhi-K village)లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (International Labor Organization), న్యూఢిల్లీ వారి సహకారంతో డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కూలీలతో పాటు గ్రామస్తులకు కార్మిక చట్టాల(Labor laws)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-శ్రమ్ కార్డు నమోదు మరియు సామాజిక భద్రతా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.

ఈ సందర్భంగా కార్మికులకు కార్మిక చట్టాలు, హక్కుల గురించి వివరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డు నమోదు చేసుకుని దాని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీరు తెన్నులను వివరించారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందెల గంగామణి సత్యనారాయణ్, పంచాయతీ సెక్రెటరీ నర్సయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ గజేందర్, ఉప సర్పంచ్ పట్టెపు పోషెట్టి, ఉపాధి కూలీలు, కార్మికులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు