టీబీ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దు

20-11-2026 | 03:19pm

సర్పంచ్‌ ఆవుల సుందరయ్య యాదవ్‌

చిట్యాల,(విజయక్రాంతి): టీబీ వ్యాధి నిర్ధారణ(TB diagnosis) కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌రే శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, టీబీ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని చిన్నకాపర్తి సర్పంచ్‌ ఆవుల సుందరయ్య యాదవ్‌(Sarpanch Avula Sundarayya Yadav) సూచించారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌(TB Mukt Bharat Abhiyan)లో భాగంగా శుక్రవారం చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన టీబీ ఎక్స్‌రే శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం కావచ్చని తెలిపారు. గ్రామాన్ని టీబీ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పి. లక్ష్మి, సూపర్వైజర్‌ అజయ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సైదులు, ఏఎన్‌ఎంలు సరస్వతి, సాయివాణి, వార్డు సభ్యుడు ఈరమల్ల దయాకర్‌, నాయకులు వలిగొండ సత్యనారాయణ, ఆశా కార్యకర్త కొత్త సంతోష తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు