పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు
చిన్న శంకరంపేట్ /చేగుంట నవంబర్ 10,విజయక్రాంతి : చిన్నశంకరంపేట మండలంలోని(Chinnashankarampet Mandal) ధర్పల్లి గ్రామ పాఠశాలలో(Dharpalli Village School) జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం(Police Cultural Troupe) ఆధ్వర్యంలో విద్యార్థులకు(Students') అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఐ విఠల్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు సురేందర్ పాటలు, నాటికలు, ప్రదర్శనల ద్వారా సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు భద్రత వంటి అంశాలను వివరించారు.
విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజంలో నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఏదైనా సమస్య ఎదురైతే పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ విఠల్, పోలీస్ కళాబృందం సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.