సర్ సిల్క్ బాధితులకు అండగా ఉంటా.. అధైర్య పడొద్దు

10-11-2026 | 09:12pm

ఎమ్మెల్సీ దండే విటల్ 

కాగజ్ నగర్ ,నంబర్ 10 ( విజయక్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్నగర్ పట్టణంలోని సర్ సిల్క్  బాధితులకు అండగా ఉంటానని, వారు ఎట్టి పరిస్థితుల్లో  అధైర్య పడద్దని ఎమ్మెల్సీ దండే విటల్(MLC Dande Vittal) తెలిపారు. మంగళవారం తన నివాసం  లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ సిల్ మిల్లు యాజమాన్యం  హైకోర్టులో పిటిషన్ వేయడంతో  జడ్జ్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో  రెవెన్యూ అధికారులు సర్ సిల్క్ ప్రాంతంలోని 4775 మంది  నివాసితులకు నోటీసులు జారీ చేసినట్లు ఎమ్మెల్సీ విటల్ పేర్కొన్నారు.

రాజకీయాలకు ఖచ్చితంగా బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నాయకులు   సమిష్టిగా కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు. బాధితులను భయపెడుతూ, వారిని ఇబ్బందులకు గురి చేరదని హితవు పలికారు. హైదరాబాదులో ఉన్న బిఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  సర్ సిల్క్  బాధితులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడం మానుకోవాలని హితవు  పలికారు. గతంలో బిఆర్ఎస్ హయాంలోనే సర్ సిల్క్ మళ్లీ యాజమాన్ యం ఆధ్వర్యంలో ఉన్న భూములకు , సర్ సిల్క్ కార్మికుల క్వార్టర్లకు వేలంపాట నిర్వహించినట్లు వివరించారు.
ఈ ప్రక్రియ మొత్తం టిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిందని, సమస్యకు పరిష్కారం చూయించకుండా బాధితులను   భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు జ్యోతి, శారద , మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ కౌన్సిలర్  షబ్బీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు