రైతులకు భరోసా.. బ్యాంకర్లకు భట్టి కీలక ఆదేశాలు

10-11-2026 | 04:17pm

హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా పంట రుణాల మంజూరు, కరువు సహాయక కార్యక్రమాలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేక సమావేశం(Telangana SLBC Meeting) నిర్వహించింది. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఖరీఫ్ సీజన్‌(Kharif season)లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు(Farmers) ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రైతులకు అవసరమైన బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బ్యాంకు అధికారులను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.

వర్షాభావ ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అవసరమైన సహాయాన్ని వేగంగా అందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రుణ సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

మరిన్ని వార్తలు