రేపు రుద్రంగి పర్యటనకు మంత్రి అడ్లూరి, విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి నవంబర్ 10(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండలంలో బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Lakshman Kumar), ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) పర్యటించనున్నట్టు రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య తెలిపారు. 4 కోట్ల 57 లక్షల నిధులతో ఒడ్డెరా కాలనీ నుండి కుక్కల గండి తండా వరకు బిటి రోడ్డు, అలాగే 2 కోట్ల 50 లక్షల నిధులతో దసరా నాయక్ తండా బ్రిడ్జి సిసి రోడ్డు(Bridge CC road) నిర్మాణానికి భూమి పూజ చేయడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వస్తున్నట్టు తెలిపారు.కోట్ల రూపాయలతో రుద్రంగి మండలాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి కి ఎమ్మెల్యే కు ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు.