వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
నేరేడుచర్ల, నవంబర్ 10(విజయక్రాంతి): పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM Sri Zilla Parishad High School) నేరేడుచర్ల(Nereducherla) నందు విద్యార్థులకు(Students') వినియోగదారుల హక్కులపై(Consumer rights) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్చార్జి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు వినియోగదారుల చట్టం 1986 గురించి వివరించి, వినియోగదారుల రక్షణ చట్టం సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు బట్టు మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకొని రక్షణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.