రెవెన్యూ సమస్యల పరిష్కారం లో సబ్ కలెక్టర్ చొరవ వహించాలి

10-11-2026 | 09:21pm

ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు 

కాగజ్ నగర్ ,నవంబర్ 10 ( విజయక్రాంతి) : ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కారంలో(Resolution of Revenue Issues) సబ్ కలెక్టర్ శ్రద్ధ వహించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(Sirpur MLA Dr. Harish Babu) కోరారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District)  సిర్పూర్ టి మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో(Revenue Conference) ఎమ్మెల్యే మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ధరణి పోటోల్లో(Dharani Photo) డిజిటల్ సంతకాల(digital signatures) సమస్యతో  పట్టా పాస్ బుక్కులు జారి(Issuance of Pattadar Passbooks) కాకుండా ఇబ్బందులు పడ్డారని అన్నారు.

ప్రస్తుతం భూభారతి పోర్టల్(BhuBharati Portal) రావడంతో సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరిను కోరారు. ఈ సమావేశంలో  సిర్పూర్ టి మేజర్ గ్రామపంచాయతీ  సర్పంచ్ వడ్డేటి నాన్నయ్య, తాసిల్దార్ రహీముద్దీన్ , వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు