మల్లెచెరువుకు కొత్త కళ.. మహిళలకు పండుగ వేళ ఆనందం!

10-10-2026 | 10:30pm

రామాయంపేట,(విజయక్రాంతి):  పట్టణంలోని మల్లెచెరువు వద్ద పెత్తరమావాస్య సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు(Engilipula Bathukamma Celebrations ) ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా(Municipal Chairperson Gajawada Lavanya Nagraj Gupta) మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకల్లో సందడి చేశారు. గతంలో బతుకమ్మల నిమజ్జనానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం చెరువును సుందరీకరించి రహదారి సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు(MLA Dr. Mynampally Rohit Rao) సహకారంతో రామాయంపేట అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొంటూ, పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా, దేవుని రంజిత్, పుట్టి సందీప్, దాకి శ్యామల స్వామి, బహిరంగ సప్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు