కరెంటు కోసం రోడ్డెక్కి,రాస్తారోక్ నిర్వహించిన రైతులు

14-10-2026 | 02:26pm

చేగుంట , అక్టోబర్ 13 :విజయక్రాంతి: రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ చేగుంట మండలం మక్కారాజ్ పేట్ లో గాంధీ చౌరస్తా వద్ద సర్పంచ్ రేఖ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో  రైతులు బుధవారం  ధర్నా  రాస్తారోక్ (Sit-in and Road Blockade)నిర్వహించారు. 

బుధవారం చేగుంట -గజ్వెల్ ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్‌ కోతలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వ హయాంలో  రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు రైతుబంధు పథకంతో అండగా నిలిచారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

మరిన్ని వార్తలు