కూష్మాండ దేవిగా వనదుర్గమ్మ..

14-10-2026 | 02:09pm
  1. అంగరంగ వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  2. తీరొక్క మొక్కులు చెల్లించుకుంటున్న భక్తజనం

పాపన్నపేట,అక్టోబర్14:  భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇంటి ఇలవేల్పుగా.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో(Etupayala Vanadurga Devi Shrine) దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా  కొనసాగుతున్నాయి.

నాలుగవ రోజు బుధవారం చవితి పురస్కరించుకొని వనదుర్గామాతను కూష్మాండ(మహా చండి) దేవి రూపంలో, ఆకుపచ్చ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి ఆకుపచ్చ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

రేపు మహాలక్ష్మి దేవిగా వనదుర్గమ్మ దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజైన గురువారం వనదుర్గామాత మహాలక్ష్మి  (స్కందమాత) దేవి రూపం, పెసర రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు