చివరి యాత్ర మజిలీల.. అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు
- స్మశాన వాటికలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
- డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్
జవహర్ నగర్, అక్టోబర్ 28 ( విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో హిందూ స్మశాన వాటికలో 11 లక్షల రూపాయలతో బుధవారం అభివృద్ధి పనులకు మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ తదితర పార్టీ శ్రేణులతో కలిసి శ్రీకాంత్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ స్మశాన వాటికలను(చివరి యాత్ర మజిలీలను) మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జవహర్ నగర్ లోని వైకుంఠధామాలలో తాగడానికి మంచినీరు, నీడనిచ్చే షెడ్లు మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, సీనియర్ నాయకులు రజిత గోపాల్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, కారంగుల రాజు గౌడ్, ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, సామాజిక సేవకులు ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, జోగి సునీత, మాధవరెడ్డి, కోశాధికారి అశోక్ గుప్తా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్ కదం, నాయకులు సాయికృష్ణ, బబ్లు ముదిరాజ్, భాస్కర్ గౌడ్, కిషోర్, మంజుల, రవి, శ్రీరామ్, రాజు నిర్వాహకులు యాదయ్య, యాదగిరి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.