రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షనే ధ్యేయం
గురువారం జరిగే సంవిధాన్ రక్ష మార్చ్ ని విజయవంతం చేయండి..
జిల్లా కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ రక్ష కోఆర్డినేటర్ గజ్జలకాంతం..
జవహర్ నగర్ నవంబర్ 25 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షనే ధ్యేయమని" భారత రాజ్యాంగాన్ని రక్షించి దేశాన్ని కాపాడండి" అని జిల్లా కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ రక్ష కోఆర్డినేటర్ గజ్జలకాంతం(Gajjala Kantham) పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న సంవిధాన్ రక్ష (రాజ్యాంగ రక్షణ ర్యాలీ) మార్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా బుధవారం జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్ సంవిధానం రక్ష (రాజ్యాంగ రక్షణ ర్యాలీ) మార్చి కోఆర్డినేటర్ గజ్జలకాంతం ముఖ్యఅతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సంవిధాన్ రక్ష మార్చి యొక్క ముఖ్య ఉద్దేశాలు భారత రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకత ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ గురించి వివరించారు.
ఈనెల 26వ తేదీన జరిగే మార్చిలో జవహర్ నగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి అనంతలక్ష్మి, మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ సాయి, ఉపాధ్యక్షులు మాట్ల వినయ్, డి ఎస్ ఎస్ వెంకటేశ్వర్లు భాస్కర్, రమేష్ చారి, మాట్ల శ్రీను, సాయికిరణ్, యువజన అధ్యక్షులు సోమేశ్వర చారి, మాజీ మహిళా అధ్యక్షురాలు చింత విజయ, దామాల ప్రభాకర్, రాజు యాదవ్ మురళి, భాను, శారద తదితరులు పాల్గొన్నారు.