స్ప్రింగ్ ఆనకట్ట(మత్తడి) మరమ్మత్తు పనుల సర్వే

25-11-2026 | 08:23pm

బెజ్జూర్ నవంబర్ 25 (విజయక్రాంతి): బెజ్జూరు మండలం స్ప్రింగ్ ఆనకట్ట మత్తడి మరమ్మత్తుల కోసం ఇరిగేషన్ ఏఈ శివకుమార్(Irrigation AE Shivakumar) సర్వే చేశారు. స్ప్రింగ్ ఆనకట్ట కింద దాదాపు 400 ఎకరాలకు పైగా భూమి రైతులు సాగు చేస్తున్నారు. కానీ మత్తడిలో ఇసుక మీటలు వేయడం, కట్ట పగుళ్లు తేలడం, కాలువలు తెగిపోవడంతో నీరు నిల్వ ఉండకపోవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఇటీవల వార్డు సభ్యులు సామల తిరుపతి  ఎమ్మెల్యే హరీష్ బాబుగారి దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బుధవారం ఇరిగేషన్ ఏఇ శివకుమార్ సిబ్బందితో పరిశీలించి సర్వే నిర్వహించారు.

మరిన్ని వార్తలు