‘బీమా’ పథకానికి శ్రీకారం

19-11-2026 | 05:35am
  1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నేడు
  2. మూడు మున్సిపాలిటీలలో 25,750 కుటుంబాలకు ప్రయోజనం
  3. ఎంఎంసీ, సీఎంసీలలో కూడా అమలు
  4. కుటుంబానికి రూ.౫లక్షల బీమా వర్తింపు 
  5. కులం, ఆదాయంతో సంబంధం లేకుండా అమలు 

మేడ్చల్, నవంబర్ 18 (విజయక్రాంతి): కుటుంబ పెద్దకు ఏదైనా ఆపద ఎదురైతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి(Indiramma Family Life Insurance Scheme) శ్రీకారం చుట్టింది. ఈ పథకం 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం వల్ల ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీల పరిధిలోని 68 వార్డులలో 25750 కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. మూడు మున్సిపాలిటీ లే కాకుండా జిల్లా పరిధిలోని మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కూడా అమలు కానుంది.

మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్ లను వేరువేరుగా పరిగణలోకి తీసుకున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు రేషన్ కార్డు తో పాటు ప్రభుత్వ కుటుంబ సర్వేలో నమోదైన కుటుంబాలను ప్రాతిపదికంగా తీసుకొని అర్హులను గుర్తించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఈ పథకం కింద బీమా వర్తించనుంది. ఒకరికంటే ఎక్కువ మంది సంపాదించేవారు ఉంటే వారిలో ఎవరి పేరు మీద బీమా పొందాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలి. ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇంటి పెద్ద కు ఏదైనా అనుకోకుండా జరిగితే రూ. ఐదు లక్షలు బీమా సాయం అందుతుంది. 

నేటి నుంచి నమోదు..

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి 19వ తేదీ నుంచి నమోదు చేసుకోవాలి. వచ్చే నెల 18వ తేదీ వరకు నమోదు చేసుకుని అవకాశం ఉంది. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు వారు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి అర్హులు. నామిని ని ఎంపిక చేసుకుని అవకాశముంది. నమోదు చేసుకున్న సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, నామిని వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్ అవసరమవుతాయి. శ్రీ పథకానికి ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని కులాల వారు అర్హులు. 

పథకంపై ప్రజలకు అవగాహన అవసరం.. 

ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగేలా ఈ పథకం రూపొందించినప్పటికీ దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ఈ పథకంలో నమోదు చేయించుకోవడానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ముందస్తుగా ఈ పథకం గురించి ప్రచారం చేస్తే ప్రజలు పేర్ల నమోదు చేయించుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. అధికార యంత్రాంగం దీనిపై సరైన ప్రచారం చేయలేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్లి పథకం గురించి వివరించాల్సిన అవసరం ఉంది. అన్ని కుటుంబాలను నమోదు చేయిస్తే వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు