ఎక్కాలు రాకున్నా చంద్రయాన్!
నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న చిత్రం ‘చంద్రయాన్’(Chandrayaan Movie). ఇందులో శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేశ్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై(Simba Screen Stories banner) ప్రవీణ్ మొలక నిర్మిస్తుండగా, శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 13న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే చంద్రుడి మీదకు తమ స్పేస్ క్రాఫ్ట్‌లను పంపగలిగాయి.
అలాంటి ప్రయత్నం మందమర్రి అనే చిన్న గ్రామంలో లెక్కలు, ఎక్కాలు రాని నలుగురు కుర్రాళ్లు చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ హ్యూమర్‌ను సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతోందీ సినిమా. ఆ ఫన్‌కు చిన్న శాంపిల్ ఈ ట్రైలర్. ఈ చిత్రానికి డీవోపీ: శ్రీనివాస బీ; సంగీతం: హర్ష ప్రవీణ్; ఎడిటర్: పుల్లారావు దాసరి; ప్రొడక్షన్ డిజైన్:- శ్రీధర్ మేస్త్రి, మందర్ పస్నేకర్; సమర్పణ: వేణు ఊడుగుల; నిర్మాత: ప్రవీణ్ మొలక; స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీనాథ్ చంద్రశేఖర్.