మా గుర్తింపును కాపాడండి: మెగాస్టార్

16-11-2026 | 10:13am

AIతో వ్యక్తిత్వ హననానికి అడ్డుకట్ట వేయాలి.. కేంద్రానికి మెమోరాండం!

హైదరాబాద్: Artificial Intelligence (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ Deepfake వీడియోలు, Digital Impersonation ద్వారా వ్యక్తుల గుర్తింపును దెబ్బతీసే ఘటనలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇటీవల జరిగిన సమావేశం అనంతరం, ఆయన సూచన మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కేంద్ర హోంశాఖతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించిన ఈ Memorandumలో AI దుర్వినియోగం, నకిలీ వీడియోలు, డిజిటల్ గుర్తింపు చోరీ వంటి అంశాలపై మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా కళాకారుల వ్యక్తిగత గుర్తింపు, గౌరవం, సృజనాత్మక హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు సామాన్య పౌరుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు. Technology అనేది సృజనాత్మకతను పెంచాలి కానీ, వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయకూడదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం Deepfake ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.



మరిన్ని వార్తలు