టాపర్ వెనుక ఇంత పెద్ద మోసమా?

16-11-2026 | 09:41am

AI Glassesతో పరీక్షలో చీటింగ్.. టాపర్ సంచలన ఒప్పుకోలు

దక్షిణ కొరియా: పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించేందుకు కొందరు విద్యార్థులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో వెలుగుచూసిన ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. దేశంలో అత్యంత కఠినమైన జాతీయ Tax Accountant అర్హత పరీక్షలో టాపర్‌గా నిలిచిన ఓ అభ్యర్థి.. తాను Artificial Intelligence (AI) సాయంతో చీటింగ్ చేసినట్లు స్వయంగా అంగీకరించాడు.

పరీక్ష సమయంలో AI Glasses ఉపయోగించి ప్రశ్నలను ఫొటోలు తీశానని, వాటిని ఫోన్‌లోని AI Toolకు పంపించి వచ్చిన సమాధానాలను రాశానని అతను వెల్లడించాడు. ఈ పరీక్షలో 400 మార్కులకు ఏకంగా 397.5 మార్కులు సాధించి, 160 ప్రశ్నల్లో 159కు సరైన సమాధానాలు ఇచ్చాడు. అసాధారణ ఫలితంపై అనుమానాలు వ్యక్తం కావడంతో చివరకు తన తప్పును ఒప్పుకుంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

ఈ ఘటనతో దక్షిణ కొరియాలో పరీక్షల భద్రతపై చర్చ మొదలైంది. త్వరలో జరగనున్న వార్షిక కాలేజీ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి AI ఆధారిత మోసాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు