గ్లోబల్ స్థాయికి రాష్ట్ర బ్రాండ్
- ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా నిలిపేలా ప్రణాళికలు
- డిజైన్, ఇంజినీరింగ్, నాణ్యతా పరీక్షలు, పరిశోధనలపైనే దృష్టి
- హైదరాబాద్‌లో ఎన్‌డీఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సానుకూలం
- ‘ఎన్‌డీఈ జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి) : ఏరోస్పేస్(Aerospace), డిఫెన్స్ రంగాల్లో(Defense sectors) తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు.
కేవ లం తయారీ రంగానికే పరిమితం కాకుం డా.. డిజైన్, ఇంజినీరింగ్, నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణ, పరిశోధన తదితర విభా గాలనూ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్‌ఎన్టీ) ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్స్‌లో నిర్వహిం చిన నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ అండ్ ఎనేబ్లింగ్ టెక్నాలజీస్ (ఎన్‌డీఈ జాతీయ సదస్సులో విశిష్ఠ అతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు.
గ్లోబ ల్ సప్లై చైన్‌లో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌కు మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రం గాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా స్థానిక పరిశ్రమలను గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు.
విమానాలు, హెలికాప్టర్లు, ఇతర ఏరోస్పేస్, డిఫెన్స్ పరికరాల నాణ్యత, భద్రత, విశ్వసనీయతను నిర్ధారించడంలో ఎన్‌డీఈ నిపుణుల పాత్ర కీలకమన్నారు. అడ్వాన్డ్స్ మెటీరియల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటిని పరీక్షించే విధానాలు కూడా మారాలన్నారు.
మరింత కచ్చితమైన ఫలితాల కోసం ఏఐ, డిజిటల్ ట్విన్స్, అడ్వాన్డ్స్ ఇన్‌స్పెక్షన్ పద్ధతుల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఎన్‌డీఈ నిపుణులకు మరింత డిమాండ్ ఉండనుందని, ఆ దిశగా తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ గా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఐఎస్‌ఎన్‌టీ, పరిశ్రమలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌లో ఎన్‌డీఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలన్న ఐఎస్‌ఎన్‌టీ విజ్ఞప్తిపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు.
కార్యక్రమంలో విజయక్రాంతి, మెట్రో ఇండియా పత్రికల చైర్మన్ సీఎల్ రాజం, ఐఎస్‌ఎన్‌టీ ప్రెసిడెంట్ డా.జైతీష్ ఆర్ జోషి, ఎన్‌డీఈ 2026 చైర్మన్ సూర్యప్రకాష్ గజ్జల, కన్వీనర్ మోహన్ పీ నాయర్, మిధాని సీఎండీ డా.ఎస్వీఎస్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సాంకేతికతలో భారత్ అగ్రగామి
- ప్రపంచ నాయకుడిగా ఎదగాలి
- కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
శేరిలింగంపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం వినియోగించడమే కాకుండా, స్వయంగా అభివృద్ధి చేస్తూ ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదగాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్డీఈ 2026,
ఏరోఎన్డీటీ అంతర్జాతీయ సదస్సులను ఆదివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించి, మాట్లాడారు. రక్షణ రంగంలో స్వావలంబనఊ సాధి ంచేందుకు స్వదేశీ పరీక్షా సాంకేతికతలను బలోపేతం చేయాలని, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని సూచించారు.