కామ్రేడ్ కళ్యాణ్ మాస్ కామెడీ

10-10-2026 | 05:25am

శ్రీవిష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’(Comrade Kalyan). జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం(Director Janaki Ram Marella) వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. దీంతో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “ఇది ఒక మాస్ కామెడీ సినిమా. మొదటిసారి ఈ జానర్‌ను ఎంచుకోవడంతో ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనుకునేవాడ్ని. కానీ, వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. కోన ఈ కథ చెప్పినప్పుడే ఇది ఒక మంచి మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందనుకున్నాం.. మా నమ్మకం నిజమైంది. అందరూ నన్ను ‘కామ్రేడ్’ అంటున్నారు. కానీ మూవీటీమ్ అందరూ నిజమైన కామ్రేడ్‌లే. ఇది పక్కా దసరా పండుగ సినిమా” అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. “శుక్రవారం మార్నింగ్ షో నుంచే మా ‘కామ్రేడ్ కళ్యాణ్’ జనజీవన స్రవంతిలో కలిసిపోయి ‘కామెడీ కళ్యాణ్’గా మారిపోయాడు. ప్రేక్షకులు హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చాలా ఆస్వాదిస్తున్నారు” అని తెలిపారు. డైరెక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ.. “నిన్న మొన్నటి వరకు సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కొంత భయం ఉండేది. ఇప్పుడా ఆ భయం పోయింది. ప్రేక్షకుల స్పందన ఎంతో ఆనందాన్నిస్తోంది” అని చెప్పారు. ‘ఈ దసరాకు శ్రీవిష్ణు, కోన నుంచి ప్రేక్షకులకు అందిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ సినిమా’ అని నిర్మాత వెంకట కృష్ణ అన్నారు. 


మరిన్ని వార్తలు