కల్పనా చావ్లా బయోగ్రఫీ స్ఫూర్తితో రాసిన కథ ఇది!

19-11-2026 | 05:15am

దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని(Director Pawan Sadineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 20న  థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ సాధినేని విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. 

*చాలా ఇష్టంగా రాసుకున్న కథ. సినిమా కూడా అంతే అద్భుతంగా వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనుసులో నవ్వు కనిపిస్తుంది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి.. పిల్లలు చాలా స్ఫూర్తి పొందుతారు. 

*ఇది ప్రత్యేకంగా స్త్రీ సాధికారతకు సంబంధిం చిన సినిమా అయితే కాదు. ఒక మెసేజ్ చెప్పాలనీ లేదు.  సమా జంలో స్త్రీలు, పురుషులు కలిసి జీవిస్తారు. అలాంటి సమాజంలో జరిగే కథే ఇది. ఒక అమ్మాయి కలను సాధించుకోవాలని మొదలుపెట్టిన ప్రయాణంలో కృష్ణ ఎలాంటి ప్రోత్సా హాన్ని ఇచ్చాడు? ఆ ప్రయాణం ఎలా సాగింది? అనేది అందంగా ఉండే కథ. ఇది ఒక ఆశను చిగురింపజేసే కథ. ప్రస్తుత సమాజంలో నెగెటివిటీ చాలా ఎక్కువైపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో కూడా కృష్ణలాంటి క్యారెక్టర్ ఉంటే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది.

*ముందు నేను కథను, పాత్రలను రాసు కుంటా. ఆ తర్వాత ఆ పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరో చూస్తా. కృష్ణ పాత్రకు దుల్కర్ 100 శాతం న్యాయం చేశారు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపో యారు. ఆయనకూడా ఈ కథ చాలా నచ్చింది. 

*కథలో శ్రుతి హాసన్‌ది కీలక పాత్ర. తన కెరీర్‌లోనే గుర్తుండిపోతుందీ క్యారెక్టర్. తన పాత్రను చూసి ప్రతి మహిళా స్ఫూర్తి పొందేలా వుంటుంది. 

*ఇది యూనివర్సల్ కథ. అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్తుంది. ఇది ఒక తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. 

*కరోనా సమయంలో కల్పనా చావ్లా బయోగ్రఫీ చదువుతున్నప్పుడు ఆమె జర్నీ కంటే ఆమెపై ఆమె భర్తకు ఉన్న ప్రేమ నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. అది నాకు చాలా స్ఫూర్తిమంతంగా అనిపించింది. అక్కడే ఈ కథకు బీజం పడింది. ఈ సినిమా కోసం -రెండేళ్లపాటు చాలా రీసెర్చ్ చేశాం. శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లతో పాటు ఎంతోమందితో కూర్చుని వాళ్ల సూచనలు, సలహాలు తీసుకున్నాం. అంతరిక్షానికి సంబంధించి పదజాలం, ఇతర విషయాల గురించి అవగాహన పెంచుకున్నాం. ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్ చేసిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాం. 

*ఈ కథ కోసం హీరోయిన్‌ను వెతకడం మాకు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇది పూర్తిగా తన చుట్టూ నడిచే కథ. కొత్త ముఖం అయితే బాగుంటుందని మొదటి నుంచి భావించాం. సోషల్ మీడియాలో సాత్విక రీల్స్ చూసి, ఆడిషన్ చేసి ఎంపిక చేశాం. తను ఆ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది. 

మరిన్ని వార్తలు