నా డైరెక్షన్‌కు టైముంది!
మౌళి తనూజ్ ప్రశాంత్(Mauli Tanuj Prashanth) హీరోగా నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘డీఎన్‌కే’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై(Mythri Movie Makers banner) రూపొందుతున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
“దొంగ నా కొడుకు’ టైటిల్ విన్నప్పుడు కథకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అయితే సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పారు. -ఇది మంచి వినోదాత్మకమైన కథాంశం. ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు. అందుకే ఈ సినిమాను ఎంచుకున్నా. నాకు ఇంతకుముందు డాన్స్ అలవాటు లేదు. కానీ సందీప్ మాస్టర్ చాలా సపోర్ట్ చేసి, ఈ సినిమాలో ఒక డాన్స్ నంబర్ చేయించారు.
దాన్ని థియేటర్లలో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ప్రొడక్షన్ చేయడానికి చాలా స్కిల్ ఉండాలి. ఆ బాధ్యతల్లో పాలుపంచుకునే అవకాశం ఇక్కడ నాకు వచ్చింది. నేర్చుకోవడానికే ఆ పనుల్లో భాగమయ్యా. దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యతతతో కూడుకున్నది. నాకు డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఉంది. కాకపోతే ఇప్పుడే కాదు. అందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. నాకైతే భవిష్యత్తులో కొత్త కథలు, వినోదాత్మకమైన సినిమాలు చేయాలని ఉంది. కొన్ని కథలు విన్నా. వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి” అని తెలిపారు.