‘ఇండియా జాయ్’ విజయవంతానికి చిత్ర పరిశ్రమ కృషి
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు
డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో(India Future City) ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit)’ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ‘ఇండియాజాయ్ 2026’కు ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమను(Telugu film industry), ఏవీజీసీ-ఎక్స్ఆర్ పరిశ్రమను(AVGC-XR Industry) ఒకచోట చేర్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయంలో బుధవారం ఈ ‘ఇండియాజాయ్(Indiajoy)’ చిత్రరంగ కార్యనిర్వాహక కమిటీ సమాశాన్ని నిర్వహించింది. తెలుగు పరిశ్రమ నుంచి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సీ కళ్యాణ్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ డీ సురేశ్‌బాబు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీఎన్ ఆదిత్య, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ప్రముఖ నిర్మాతలు హరీశ్ శంకర్, రాహుల్ రవీంద్రన్, సాయి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. “తెలుగు చిత్ర సీమని గ్లోబల్ స్థాయికి తీసుకు రావాలని సీఎం ప్రణాళికలు రచిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ ఇండియా జాయ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చేయడానికి మా వంతుగా కృషి చేస్తాం” అన్నారు. ఈ ఇండియా జాయ్ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా అతిథులు పాల్గొన్నారు. నెట్ ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డినెగ్, ఈఏ స్పోర్ట్స్, యుబిసాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ ఇతర గ్లోబల్ బ్రాండ్లకు సంబంధించి ప్రతినిధులు విచ్చేశారు.
ఈ ఇండియా జాయ్‌లో భాగంగా వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ది ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ది ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్ అండ్ ది హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు కూడా జరగున్నాయి. డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ ఈవెంట్, 9న కాన్సర్ట్ ఎరీనా ఈవెంట్‌ను ఎంఎం కీరవాణి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ అధికారులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.