అందరికీ రిలేట్ అయ్యేలా ఇంకా ఏం అనుకోలేదు!
అక్షయ్ లగుసాని(Akshay Lagusani ), కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’.(Inka Em Anukoledu) వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ నిర్మించిన ఈ సినిమాను ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా తెరకెక్కించారు. జయకృష్ణ, రావు రమేశ్, హర్షవర్ధన్, అనిత చౌదరి, సుబ్బరాజు ఇందులో ముఖ్య పాత్రలను పోషించారు.
ఈ సినిమాని డిసెంబర్ 11న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే పాటను లాంచ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో చిత్ర కథానాయకుడు అక్షయ్ లగుసాని మాట్లాడుతూ.. “డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి” అన్నారు. కథానాయకి కేయూరి మాట్లాడుతూ.. “ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో నాకు మంచి పాత్రను పోషించా.
మేం రిలీజ్ చేసిన పాట అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా” అని చెప్పింది. దర్శకుడు ప్రణయ్ వల్లూరిపల్లి మాట్లాడుతూ.. “ఇంకా ఏం అనుకోలేదు!’లో అన్ని పాటలు బాగుంటాయి. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం” అని తెలిపారు. మరో దర్శకుడు గిరి పెమ్మసాని మాట్లాడుతూ.. “ఇదే మాకు తొలి చిత్రం. డిసెంబర్ 11న మా సినిమాను ఆదరించండి” అన్నారు.
నిర్మాత వంశీ మాట్లాడుతూ.. “ఈ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గిరి, ప్రణయ్ పేర్లు ఇండస్ట్రీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది” అన్నారు. నటుడు జై కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, డైలాగ్ రైటర్ అనురాగ్, ఎడిటర్ నరేంద్ర, కెమెరామెన్ రెహాన్, కో ప్రొడ్యూసర్ సమీర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రఘు, క్రియేటివ్ ప్రొడ్యూసర్లు సాయి కిషోర్, తన్మయ్ తదితరులు మాట్లాడారు.