తొలి సినిమాకే అలా చేశాడు!

07-11-2026 | 05:20am

నాగార్జున అక్కినేని సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’(Itlu Arjuna' Release). అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో మహేశ్ ఉప్పల దర్శకుడిగా, దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా పరిచయం అవుతున్నారు. తన కొత్త బ్యానర్ ‘వాట్ నెక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వెంకీ కుడుముల. నవంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరులతో పంచుకుంది.

ఆ ముచ్చట్లు ఇవీ.. “-తెలుగులో నేను ఫస్ట్ సైన్ చేసిన సినిమా ‘ఇట్లు అర్జున’. కాకపోతే ‘ఛాంపియన్’ ముందు రిలీజ్ అయింది. ‘-ఇట్లు అర్జున’లో చేసిన కీర్తి క్యారెక్టర్ యూత్‌ఫుల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. ప్రతి అమ్మాయికీ కనెక్ట్ అవుతుంది.  ఇందులో హీరోకు మాటలు ఉండవు! ఇలాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. మెయిన్ కోర్ ప్రేమకథ. మాటలు రాని అర్జున్ క్యారెక్టర్ తన ప్రేమను ఎలా తెలుపుతాడనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. -హీరోగా అనీష్‌కు ఇది ఫస్ట్ సినిమా.

తొలి సినిమాకే ఒక మూగవాడి పాత్ర చేయడం చాలా డేరింగ్ అండ్ రిస్కీ. ఈ విషయంలో తనను అభినందిస్తున్నా. నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. తెలుగులో వరుసగా పెద్ద అవకాశాలతో ఆనందంగా ఉన్నా. కాకాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది. దీపావళిని ‘ఇట్లు అర్జున్’ సక్సెస్‌తో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా” అని చెప్పిది. 


మరిన్ని వార్తలు