కమల్ హాసన్.. సండియార్!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Universal Hero Kamal Haasan) ప్రస్తుతం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రా న్ని నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గ్రే గడ్డంతో, చిన్నగా కత్తిరించిన హెయిర్ స్టుల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. వైలెన్స్ మధ్య సాగే ఓ బలమైన పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారనే ఆసక్తిని కలిగిస్తోందీ తాజా పోస్టర్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సునీల్ కేఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా, సీఎస్ బాలచందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
22 ఏళ్ల నాటి టైటిల్..
‘సండియార్’ అంటే తమిళంలో ఒక పోరాట యోధుడు, మొండివాడు, దేనికైనా తెగించేవాడు లేదా గొడవలకు దిగే మొరటు వ్యక్తి అని అర్థం. సినిమా పరంగా చూస్తే, ఇది సమాజానికి లేదా శత్రువులకు ఎదురుతిరిగే ఒక భయం లేని, దూకుడు స్వభావం గల శక్తిమంతమైన పాత్ర అని అర్థమవుతోంది. అయితే, వాస్తవానికి ఈ టైటిల్ గతంలో 22 ఏళ్ల క్రితం అనుకున్నదే! 2004లో కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘విరుమాండి’కి తొలుత అనుకున్న పేరు ‘సండియార్’.
అప్పట్లో ఈ టైటిల్ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఒక ఆధిపత్య కులాన్ని హెచ్చించేలా ఉందంటూ కొన్ని రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో, కమల్ హాసన్ అప్పట్లో ఆ టైటిల్‌ను ‘విరుమాండి’గా మార్చారు. అప్పట్లో తాను పెట్టలేకపోయిన అదే పవర్‌ఫుల్ టైటిల్‌నున దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ తన కొత్త సినిమాకు అధికారికంగా ఖరారు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.