ఇలాంటి ఆఫర్ ఏ ఫిలింమేకరూ ఇవ్వలేదు!

29-10-2026 | 05:10am

జ్యోతి పూర్వజ్(Jyothi Poorvaj), పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్(Killer)‘. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి ఏ నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. బుధవారం ఈ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ.. “మా సినిమాలోని ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించాం.

హైకోర్టు లాయర్‌తో కొన్ని నిబంధనలతో అగ్రిమెంట్ రాయించి మరీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 29న 10 గంటలకు ప్రీమియర్స్ ఉంటాయి. సినిమా సెకండాఫ్‌లో వచ్చే మేజర్ ట్విస్ట్‌కి ఒక మేజర్ రీజన్ ఉంటుంది. ఇంటర్వెల్ ఇచ్చిన 5 నిమిషాల్లో జస్ట్ వన్ లైన్ ఆన్సర్ మా వాట్సాప్ నెంబర్ 7330608675కు పంపాలి. షో చూస్తున్న టికెట్ ఫొటో పెట్టి ఆన్సర్ రాయాలి. ఆ ఐదు నిమిషాల్లో వచ్చిన మెసేజ్‌లు అన్నీ ఈ మొబైల్‌లో రికార్డ్ అయ్యి ఉంటాయి. మీరు పంపే సమధానం మా ఆన్సర్‌తో పోలి ఉండాలి. సక్సెస్ మీట్‌లో ఆ విజేతను ప్రకటిస్తాం.

తక్కువ టైమ్‌లో ఆన్సర్ పంపిన వారికి బహుమతి ఉంటుంది. కిల్లర్ నుంచి నాలుగైదు భాగాలు రాబోతున్నాయి” అన్నారు. హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. “మా సినిమా కోసం సూపర్ షీ కాంటెస్ట్ నిర్వహించాం. ఇన్స్‌ఫైరింగ్ ఆన్సర్స్ పంపిన 8 మందిని సెలెక్ట్ చేసి, ఒక్కొక్కరికి రూజ20 వేల చొప్పున ఈ వేదిక మీద అందించడం సంతోషంగా ఉంది. మనలోనే సూపర్ పవర్స్ ఉన్నాయి. మన దేశాన్ని అనునిత్యం కాపాడుతున్న సైనికులను సూపర్ పవర్స్ అనుకోవచ్చు. వారికి మా టీమ్ అంతా సెల్యూట్ చేస్తోంది.

కిల్లర్ లాంటి బ్రిలియంట్ సబ్జెక్ట్ ను తెరపైకి తీసుకొస్తున్న పూర్వజ్‌కు కంగ్రాట్స్‌” అన్నారు. హైకోర్ట్ లాయర్ సురేశ్ మాట్లాడుతూ.. “పూర్వాజ్ తన సినిమా మీద నమ్మకంతో కోటి రూపాయల ఆఫర్ ప్రేక్షకులకు ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్ ఇప్పటిదాకా ఏ ఫిలింమేకర్ ఇవ్వలేదు. ఆయన ధైర్యాన్ని, నమ్మకాన్ని మనమంతా అభినందంచాలి. థియేటర్‌లో సినిమా చూసి కథలోని ట్విస్ట్‌ను ఊహించి చెప్పిన వారికే ఈ బహుమతి ఉంటుంది” అని తెలిపారు. చిత్రబృందం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు