ట్విస్ట్ ఊహించి చెబితే రూ.కోటి బహుమతి
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’(Thriller movie ‘Killer’). ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వాజ్ , పద్మనాభరెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు.
పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్ కు వచ్చాక పూర్వాజ్ తో మాట్లాడుతూ.. ‘న్యూరో లింక్ కథ ఇది. ఈ మధ్య ఎలాన్ మస్క్ న్యూరో లింక్‌పై పరిశోధనలు చేయిస్తున్నారు.
ఈ న్యూరో లింక్ సూపర్ షీని కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది‘ అన్నారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ.. ‘మూడు డిఫరెంట్ లేయర్స్ ఉన్న కథతో ఈ సినిమా ఉంటుంది. జ్యోతి చేసిన అన్ని క్యారెక్టర్స్‌ను తెరపై చూస్తున్నప్పుడు కొత్తగా ఫీల్ అవుతారు. ఆమె ఎవరు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటుంది.
ఆ క్యారెక్టర్‌లోని ట్విస్ట్ ఏంటనేది మీరు ఊహించలేరు. సెకండాఫ్‌లో వచ్చే ఆ ట్విస్ట్‌ను ఇంటర్‌వెల్ పడిన ఐదు నిమిషాల్లోపు ఊహించి మేము ఇచ్చే వాట్సాప్ నెంబర్‌కు పంపిస్తే ఆ పర్సన్‌కు మా మూవీ సక్సెస్ మీట్ రోజున కోటి రూపాయల బహుమతి అందిస్తాం’ అన్నారు. హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. ‘కిల్లర్’ కథ చాలా కొత్తగా ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్థాయిసై ఫై ఫిక్షన్‌తో, ఆ తరహా స్క్రీన్ ప్లేతో చేసిన చిత్రమిది. ఇలాంటి వినూత్నమైన సినిమా తెరకెక్కించిన పూర్వాజ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. పూర్వాజ్ విజన్ వైవిధ్యంగా ఉంటుంది. నేను సీరియల్స్‌లో మిమ్మల్ని ఆకట్టుకున్నాను. సినిమాల్లో తను ఏం చేయబోతోంది అనుకునేవాళ్లకు నా సమాధానం ‘కిల్లర్’ అని తెలిపారు.
నిర్మాత పద్మనాభరెడ్డి.ఎ. మాట్లాడుతూ.. ‘మేము నమ్మిన ఒక కొత్త దర్శకుడు ఈ రోజు ఎదగడం చూస్తుంటే సంతోషంగా సంతృప్తిగా ఉంది. డీవోపీ జగదీశ్ బొమ్మిశెట్టి కూడా మంచి పేరు తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. ఆయన కథలు, కాన్సెప్ట్‌ల కంటే దర్శకుడిగా ఆయన ప్రతిభనే ఎక్కువగా నమ్మాను. మా కాంబినేషన్‌ను ఇలా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చెప్పారు.