ఈ నెలాఖరున ఆదర్శ కుటుంబం

22-10-2026 | 05:51am

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam) హౌస్ నెం. 47’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళికి ముందు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు పండుగ వినోదాన్ని అందించనుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌పూర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ.ఎస్. ప్రకాశ్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కెవిన్ కుమార్ ఫైట్‌ను రూపొందించారు.


మరిన్ని వార్తలు