అన్నయ్య పానంలో..

22-10-2026 | 05:49am

చార్మింగ్ స్టార్ శర్వా పీరియడ్ (Charming Star Sharwa’s Period)యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆరట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీరాధామోహన్ సమర్పిస్తున్నారు. దసరాకు ఒక రోజు ముందు మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో పాట ‘అన్నయ్య పానం’ను విడుదల చేశారు.

ఐదుగురు చెల్లెళ్లపై ఒక అన్నయ్య చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతలను హృద్యంగా ఆవిష్కరించే ఈ పాటతో పాటు, ప్రధాన జంట ప్రేమకథకు సంబంధి ంచిన కొన్ని అందమైన క్షణాలను కూడా చూపించారు.

ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపర్చగా, చంద్రబోస్ సాహిత్యం అందిచగా, శ్రీకృష్ణ పాడారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తోపాటు డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు