‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’
కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’గా(‘Supreme Star’) గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’. ఆరియా మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై బండి నాగరాజు నిర్మిస్తుండగా.. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 70 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. దసరా సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ఈ సినిమా పోస్టర్ లాంఛ్ జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. మూవీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, హీరో భార్గవ్, ప్రొడ్యూసర్ బండి నాగరాజు మాట్లాడారు.