నా బాడీ..నాకు గర్వం!

22-10-2026 | 05:59am

సోషల్ మీడియా వేదికగా తన శరీరాకృతిపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వైరల్ అవుతున్న వీడియోలపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్(Tollywood star heroine Payal Rajput) ఎక్స్‌లో విరుచుకుపడింది. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న నెటిజన్లకు ఆమె గట్టిగా బుద్ధి చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాయల్ రాజ్‌పూత్ తన ఎక్స్ అకౌంట్‌లో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. ‘మీకు సిగ్గుండాలి.

నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఆ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు.

మీ పరిధిలో మీరు ఉండండి, మీ పని మీరు చూసుకోండి’ అని పాయల్ పోస్టు చేసింది. పాయల్ తాజా పోస్టు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల హీరోయిన్ల బాడీని ట్రోల్స్ చేయడం, వాళ్ల వీడియోలను ఏఐతో మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం ఎక్కువైంది. ఈ విషయంపై ఇప్పటికే డిబేట్ జరుగుతోంది. ఈ సమయంలో హీరోయిన్ పాయల్ ట్వీట్ చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు