రోడ్డు వేశారు... బావిని మరిచారు!
- ఇళ్ల మధ్యనే మృత్యుకూపంగా వ్యవసాయ బావి
- అధికారుల నిర్లక్ష్యం... కంటితుడుపు చర్యలతో కాలయాపన
- మంజూరు ఒకచోట... పనులు మరోచోట
- నిధుల దుర్వినియోగంపై మండిపడుతున్న స్థానికులు
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 21(విజయక్రాంతి):గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిం చి ప్రజల సమస్యలు తీర్చాల్సిన అధికారుల నిర్లక్ష్యం, గ్రామపంచాయతీ పాలకవర్గం(Gram Panchayat Governing Body) ని మ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని రాయపోల్ గ్రా మ పంచాయతీ 6వ వార్డులో ప్రజల ప్రా ణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన దుస్థితి నెలకొంది.
నడిరోడ్డుపైనే మృత్యుకూపం..
రాయపోల్ 6వ వార్డులోని పోచమ్మ, ఆంజనేయస్వామి ల దేవాలయం వద్ద నుం డి వడ్డెర బండ వరకు వెళ్లే దారిలో, ఇళ్లకు ఆనుకుని రోడ్డుకు మధ్యలోనే ప్రమాదకరంగా ఒక వ్యవసాయ నీళ్ల (దేవతల) బావి ఉంది.
నిత్యం వాహనదారులు, బాటసారు లు, చిన్నారులు సంచరించే ఈ ప్రధాన రహదారిపై ఉన్న ఈ బావి చుట్టూ ఎలాంటి రక్షణ గోడ లేదా కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో నిమిషానికో ప్రమాదం పొంచి ఉంది. ఈ బావి పూడ్చివేసి....రక్షణ చర్యల నిమిత్తం గత కొన్నేళ్లుగా స్థానికులు అధికారులకు, పంచాయతీ పాలకవర్గానికి ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
అసంపూర్తి పనులు... కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తేనా?
పోచమ్మ ఆలయం నుంచి వడ్డెర బండ వరకు ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే, రోడ్డు మధ్యలో ఉన్న బావి సమస్యను పరిష్కరించకుండానే కాం ట్రాక్టర్, అధికారు లు పనులను మధ్యలోనే అసంపూర్తిగా వ దిలేసి వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల ను గాలికి వదిలేసి, కేవలం బిల్లులు, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే పనులు కానిచ్చే స్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంజూరు ఒకచోట... నిర్మాణం మరోచోట!
గ్రామంలో హెచ్ఎమ్డీఏ నిధుల మంజూరులోనూ తీవ్ర అక్రమాలు జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిధులు మం జూరైన అసలు ప్రదేశంలో బెల్ మూతి పనులను పూర్తి చేయకుండా ప్రమాదకరంగా వదిలేశారు. అసలు మంజూరు లేని ఇతర ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, నాసిరకంగా రోడ్డు వేసి చేతులు దు లుపుకున్నారని మండిపడుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవ్వడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.ప్రజా ప్రతి నిధులు, అధికారుల తీరుపై స్థానికుల గుర్రు గా ఉన్నారు. మా పిల్లలు బయటకు వస్తే తి రిగి ఇంటికి వచ్చే వరకు భయంతో బతకాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో వాహనదారులు ఈ బావిలో పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు‘ అని వార్డు నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలి:
సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పం దించి, రాయపోల్ గ్రామంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించాలని స్థానికులు డి మాండ్ చేస్తున్నారు. ప్రమాదకర బావికి తగి న భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, నాసిరకం పనులు చేపట్టి నిధులు పక్కదోవ ప ట్టించిన కాంట్రాక్టర్, బాధ్యులైన అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.