అదరగొడుతున్న పారాఅథ్లెట్లు

22-10-2026 | 05:30am
  1. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణాల పంట
  2. పతకాల వేటలో భారత్ జోరు
  3. 62 పతకాలతో నాలుగో స్థానం
  4. పారా ఆసియా క్రీడలు

నగోయా, అక్టోబర్ 21 : జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న పారా ఆసి యా క్రీడల్లో( Para Asian Games) భారత అథ్లెట్లు(Indian athletes) అదరగొడుతున్నారు. పతకాల వేటలో దూసుకుపో తున్నా రు. అంచనాలకు తగ్గట్టే ఇప్పటికే 62 పతకాలు గెలిచిన భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణాల పంట పండింది. అంచనాలకు మిం చి అద్భుత ప్రదర్శనతో మన అథ్లెట్లు స్వర్ణాలతో మెరిసారు.

మహిళల టీ12 విభాగంలో జరిగిన 100 మీటర్ల స్ప్రింట్ పోటీలో సిమ్రా న్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మంగళవారం నిర్వహించిన 200 మీటర్ల పరుగులోనూ ఆమె విజేతగా నిలిచింది. పురుషుల టీ47 విభాగంలో జరిగిన 100 మీటర్ల స్ప్రింట్ పోటీలో భారత అథ్లెట్ దిలీప్ స్వర్ణ పతకాన్ని అందుకున్నా డు. మరో భారత అథ్లెట్ మహ్మద్ మోర్సింగనకత్ రజత పతకం గెలుచుకున్నాడు.

పురు షుల హై జంప్ టీ44/64 విభాగంలో ప్రవీ ణ్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. 2.05 మీటర్ల ఎత్తును అధిగమించి రికార్డును కూడా నెలకొల్పాడు. ఇదే విభాగంలో బంటీ 1.92 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజతం గెలిచాడు. పురుషుల షాట్పుట్ ఎఫ్53 విభాగంలో భారత అథ్లెట్ ఆయుశ్ వర్మ పసిడి పతకం సాధించాడు.

తన ఐదో ప్రయత్నంలో 8.16 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఆయుశ్ మంగళవారం పురుషుల జావెలిన్ త్రో ఎఫ్53/54 విభాగంలో కాంస్య పతకం సాధించాడు. తాజాగా షాట్‌పుట్‌లో స్వర్ణం గెలిచి తన పతకాల సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. మహిళల షాట్‌పుట్‌లో భాగ్యశ్రీ 8.19 మీ. విసిరి సిల్వర్ మెడల్ను దక్కించుకుంది.

మరోవైపు పురుషుల 400 మీటర్ల టీ35/38 వి భాగంలో అకీరా నందన్ బానోతు రజత పతకాన్ని సాధించాడు. అతడు 51.25 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే కాంపౌండ్ ఆర్చరీ మహిళల డబుల్స్ ఫైనల్లో భారత యువ జోడీ శీతల్ దేవి, పాయల్ నాగ్ రజ త పతకంతో సరిపెట్టుకుంది. స్వర్ణం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన జు జ్యూకిం గ్, జావో జింగ్ జోడీ చేతిలో 141-150 పా యింట్ల తేడాతో ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు