శీను పార్వతీల ప్రేమకథ
టాలీవుడ్ దర్శకుడు రమేశ్ వర్మ కొత్త ప్రారంభించిన ఆర్వీ ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై(RV Film House banner) రూపొందిన తొలి సినిమా ‘కొక్కొరొకో’(Kokkoroko ). ఐదు విభిన్న పాత్రలతో తెరకెక్కుతున్న ఈ ఆంథాలజీ ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రేఖా వర్మ, కూరపాటి శిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ వర్మ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు.
ఇందులో మదాడి, మురళీకృష్ణ, త్రిష్, సప్తగిరి, సుబ్బరాజు, ప్రవీణ్, రామలింగ, శ్రీనివాస్ వడ్లమాని, జెమిని సురేశ్, పమ్మి సాయి, గోపిక ఉదయ, ప్రియాంక కుమార్, ప్రీతి నేహా, బేబీ ఎంవీ కృతి నందన, చాముండేశ్వరి చౌదరి, లక్ష్మి, వేద్విక సోనీ, అశోక్ కుమార్, అద్నామ్ సాజిద్ ఖాన్, వినోద్ సాగర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ గాయకుడు జీవీ సాగర్. సీనియర్ రచయిత జీ సత్యమూర్తి తనయుడైన ఆయన.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు సోదరుడు.
ఈ సినిమాకు జీవీ సాగర్ మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో శీను, పార్వతి ప్రేమకథను చూపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆకాశ్ ఆర్ జోషి; సంగీతం: ఎస్ కృష్ణ ప్రసాద్; పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి; మాటలు: శ్రీ సాగర్; ఫైట్స్: వెంకట్ ఎన్ వెంకటేశ్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్.