5 September, 2026 | 9:08 AM

లీసా ముగిం చారు!

05-09-2026 | 05:55am

ఓం సాయిరామ్ ఆర్ట్స్(Om Sai Ram Arts), ఐరాస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి(Venkat Duggireddy), రామకృష్ణ ఐల(Ramakrishna Aila) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’(Lisa). విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ల(Ananya Nagalla) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ఈ కథను రూపొందించారు. సినిమాటోగ్రాఫర్ సతీశ్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిచడానికి సుముఖంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు