సిద్ధుగాడి లవ్ స్టోరీ సిద్ధం

24-11-2026 | 05:20am

తెలుగు సినిమా(Telugu Cinema) అంటే ఎంతో అభిమానం, తెలుగు చిత్ర పరిశ్రమపై(Telugu Film Industry) అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి తన కలను నిజం చేసుకుంటున్న దర్శకుడు రమేశ్‌బాబు చెరుకూరు(Director Ramesh Babu Cherukuru). అమెరికాలో తన జాబ్ కొనసాగిస్తూనే, తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ(Siddhugadi Love Story)’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై సావిత్రమ్మ చెరుకూరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 27న విడుదలకు కానుందీ చిత్రం.

ఇందులో హీరోగా మనోజ్, హీరోయిన్లుగా శ్రుతి, మోహన సిద్ధి నటిస్తున్నారు. హీరో తండ్రి పాత్రలో సుమన్, విలన్ పాత్రలో సర్కార్ కనిపించనున్నారు. చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందన దక్కించుకొని, సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్‌బాబు చెరుకూరు మాట్లాడుతూ.. “నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా. ప్రేక్షకుల ఆదరణతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: దొసాడ యాదగిరి; సంగీతం: సీ యన్ ఆదిత్య; ఎడిటర్: లక్కీ ఎక్కరి; ఆర్ట్: నాని. 

మరిన్ని వార్తలు