ఛప్రి ప్రేమ ప్రయాణం
‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షణ నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్(Saroj Kumar New Film). ప్రస్తుతం ఆయన మరో వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. స్లమ్ ఏరియాలో ఉండే ఓ కుర్రాడి ప్రేమ ప్రయాణమే ఈ సినిమా. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్లో సరోజ్ చాలా కొత్తగా.. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రమేశ్ మర్రెపల్లి, ఆర్ట్ డైరెక్టర్‌గా నాని దేవరపల్లి పనిచేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.