స్కూటీపై నుంచి పడి వ్యక్తి మృతి
28-09-2026 | 12:14pm
పెబ్బేరు, సెప్టెంబర్ 28: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి స్కిడ్ కావడంతో కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.