ఇంట్లోవాళ్లు తిడుతుంటారు!

08-10-2026 | 05:25am

‘కేజీఎఫ్’ చిత్రంతో(movie 'KGF') దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Kannada beauty Srinidhi Shetty). ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేశ్, కల్యాణ్ రామ్(Victory Venkatesh, Kalyan Ram) ప్రధాన పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో(Movie promotions) భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty). ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. తన ఖాతాలో ‘కేజీఎఫ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ పడినా, తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంపై తొలిసారి స్పందించింది.

“కేజీఎఫ్’ అంత పెద్ద సక్సెస్ సాధించినా, ఇప్పటికీ కెరీర్ విషయంలో కంగారు పడకుండా ఖాళీగా కూర్చుంటుంటే ఇంట్లో వాళ్లు తిడుతుంటారు (నవ్వుతూ). కొన్నిసార్లు నా టైమింగ్ బాగోకపోవడం వల్ల కావచ్చు, లేదా మేకర్స్ నన్ను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల కావచ్చు.. అనుకున్నన్ని అవకాశాలు రాలేదు. ఇండస్ట్రీలో వరుసగా ఛాన్సులు రాకపోవడం వల్ల ‘నేను మంచి యాక్టర్ కాదేమో.. అందుకే నాకు అవకాశాలు ఇవ్వడం లేదేమో’ అనే ఒక రకమైన అభద్రతాభావం నాలో కలిగింది” అని తెలిపింది.

తను తక్కువ సినిమాలు చేయడంపై వస్తున్న కామెంట్లపైనా శ్రీనిధి స్పందించింది. ‘కేవలం డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే ఈపాటికే 30 నుంచి 40 సినిమాలు చేసేదాన్ని. కథలో బలం లేని సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. రెమ్యునరేషన్ కంటే మంచి కథ, బలమైన పాత్రలకే నేను ప్రాధాన్యత ఇస్తాను. కథ నచ్చడం.. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబో కావడం వల్లే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు వెంటనే సైన్ చేశాను” అని తెలిపింది. 

మరిన్ని వార్తలు