నల్లగొండలో‘ ది చెన్నై షైపింగ్ మాల్’
ప్రారంభించిన సినీ తార రితికా నాయక్
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ను(The Chennai Shopping Mall) ప్రముఖ సినీ తార రితికా నాయక్(Rithika Nayak).. మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్‌డబ్ల్యూసీ కోర్ర లక్ష్మి, షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ యామా కవితా దయాకర్‌లతో కలిసి ప్రారంభించారు.
పండుగల సీజన్‌లో పట్టణ ప్రజలకు సరికొత్త ఫ్యాషన్ వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ప్రారంభోత్సవం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టు చీరల కలెక్షన్ల పరిశీలన ప్రారంభోత్సవం అనంతరం రితికా నాయక్ షోరూమ్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. ముఖ్యంగా పట్టు చీరల విభాగంలో అందుబాటులో ఉన్న విభి న్న డిజైన్లు, ఆకర్షణీయమైన కలెక్షన్లను పరిశీలించారు.
సంప్రదాయ వస్త్రాలతోపాటు ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా రూపొందించిన కలెక్షన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈ మాల్‌లో వివిధ రకాల ట్రెండీ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
నిర్వాహకులు మాట్లాడుతూ.. నల్గొండ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో ది చెన్ను షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు అల్లి మల్లికార్జున్ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, కేసాని వేణుగోపాల్‌రెడ్డి, పున్న గణేష్, వంగాల అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.