ఫన్ ప్రారంభం
07-11-2026 | 05:20am
జీ సంతోషి రెడ్డి నిర్మాణంలో హేమంత్ కృష్ణ దర్శకత్వం వహించనున్న హారర్ కామెడీ చిత్రం(Horror-comedy film) ‘ఫన్’ పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కళ్యాణ్ పడాల హీరో. సాహితి, అజయ్ ఘోష్, రవిశివతేజ, వీ యశోర, సోనియా నాయుడు, జేడీవీ ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ ముఖ్య పాత్రలను పోషించానున్నారు. ఈ సినిమాకు సంగీతం: రామ్గోపాల్; కెమెరామెన్: జీఎల్ బాబు; ఎడిటర్: క్రాంతి.