ముగ్గురు కోతులు.. చిల్లర సాంగ్

14-09-2026 | 05:30am

శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’(mugguru kothulu). ఈ సినిమాలో తేజ కొండపల్లి, గణేశ్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి.

తాజాగా ఈ చిత్రంలోని ‘చిల్లర సాంగ్’ను టాలీవుడ్ నటుడు చంద్రహాస్ లాంచ్ చేశారు. ఈ పాటకు ఎస్ సుహాస్ సాహిత్యం, గాత్రం, బాణీ అందించారు. గణేశ్ బొడ్డ, సుహాస్ ఎస్ సంయుక్తంగా రాసిన ఈ లిరికల్ వీడియోలో ముగ్గురు హీరోలు సరదాగా చిల్ అవుతున్న సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్ సుహాస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు